తెలంగాణ

telangana

Voters Tried to Attack BRS Activist :

ETV Bharat / videos

ఓటుకు నోటు ఇవ్వలేదని బీఆర్​ఎస్​ కార్యకర్తపై దాడికి యత్నం - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2023, 10:50 PM IST

Voters Tried to Attack on BRS Activist :రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పర్వం ప్రశాంతంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో ఓట్ల కోసం ప్రలోభాల పర్వం జోరుగా కొనసాగింది. నాయకులు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఓటర్లకు నగదు పంపిణీ చేశారు. కానీ కొంత మంది తమకు రావాల్సిన నగదు రాలేదని వాగ్వాదానికి దిగారు. ములుగు జిల్లాలో మంగపేట మండల కేంద్రంలో ఏకంగా బీఆర్​ఎస్ కార్యకర్త ఇంటిపైకే దాడికి దిగారు. ఓట్లకు డబ్బులు ఇవ్వలేదని కార్యకర్త ఇంటికి వెళ్లి ఆందోళన చేశారు. ఓటర్లు వస్తున్న విషయం గుర్తించిన సదరు కార్యకర్త  ముందే ఇంట్లో నుంచి పరారయ్యారు.  

Voters Fires on Political Leaders :భద్రాచలంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. జిల్లాలోని ఏఎస్​ఆర్​ కాలనీలో ఓటుకు నోటు ఇవ్వలేదని ఓటర్లు నిరసన చేశారు. ఆయా కాలనీల్లో ఓటుకు నోటు పంచిన నాయకులు తమ కాలనీలో ఎందుకు ఇవ్వలేదని ఆందోళన చేశారు. ఓ పార్టీ నాయకుడికి ఓటర్లకు నగదు పంపిణీ చేయమని ఇస్తే.. కొంత మందికే నగదు ఇచ్చారని కాలనీ వాసులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఓ పార్టీ నాయకులు వారిని బుజ్జగించడంతో ఓటు వేశారు. 

ABOUT THE AUTHOR

...view details