ఓటే నీ ఆయుధం- విడవకు నీ బ్రహ్మాస్త్రం - ఓటు హక్కును వినియోగింపు
Published : Nov 6, 2023, 7:02 AM IST
Voter Awareness Program :పాలకులను ప్రశ్నించాలంటే సరైన విధానంలో ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్నారు హైదరాబాద్‌లోని పలువురు విశ్రాంత ఉద్యోగులు. ఓటు వేసి నాయకుడ్ని తప్పు పట్టడం కంటే.. జాగ్రత్తగా అన్నీ తెలుసుకొని ఓటు వేయడం మంచిదంటున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం పలు సంస్కరణలు చేపట్టాలని చెప్పారు. ముందుగా ఓటర్‌కు సంబంధించిన ఆధార్‌ను జతపరుచుకోవటం తప్పనిసరి చేయాలన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవలంటున్నారు.
ముఖ్యంగా ఒక పార్టీ తరఫున ఎన్నికైన అభ్యర్థి వేరే పార్టీలకు మారినపుడు తనకున్నటువంటి స్థానాన్ని కోల్పోయి మళ్లీ రీఎలక్షన్ వచ్చినట్లైతే అప్పుడు ప్రజల్లో ఒక నమ్మకమనేది రేకెత్తుతుందన్నారు. యువతలో ప్రధానంగా ఈ నమ్మకం కోల్పోవటం వల్లనే.. ఓటింగ్ శాతం తగ్గుతుందని వాళ్లలో కూడా ఒక అభద్రత భావం ఏర్పడి వేసిన ఓటు వృథా అనే ఆలోచన పుడుతుందని, దానివల్లనే ఓటుకు దూరంగా ఉంటున్నారని ఆ పరిస్థితిని అరికట్టగలిగితే కొంతలో కొంత మార్పు ఆశించవచ్చుంటున్నారు పలువురు విశ్రాంత ఉద్యోగులు.