తెలంగాణ

telangana

Vote Awareness Program for Assembly Election

ETV Bharat / videos

ఓటు ఒక వజ్రాయుధం - మరి ఓటేస్తానికి మీరు సిద్ధమా - voting awarness to voters for elections 2023

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2023, 10:48 PM IST

Vote Awareness Program for Assembly Election : ఓటు హక్కు రాజ్యాంగం ఇచ్చిన గొప్ప వరం.. ప్రజలకు సుపరిపాలన అందించే ప్రధాన ఆయుధం. ప్రతి ఒక్కరు ఎన్నికల్లో భాగస్వామ్యమై.. ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరచాలి. ఓటంటే కంప్యూటర్ బటన్ కాదని, తెల్లని కాగితం కాదని ఓరుగల్లులో మేధావులు చైతన్య పరుస్తున్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ.. వరంగల్‌లో రిటైర్డ్ ఉద్యోగులు, ఇంజినీర్లు, డాక్టర్లు, అవగాహన కల్పిస్తున్నారు.

ఇతర పనులకు ఎంత సమయం వెచ్చిస్తామో.. ఓటు వేసేందుకు కూడా అంతే సమయాన్ని కేటాయించాలని పలువురు కోరుతున్నారు. ఓటును వినియోగించుకొని బాధ్యత గల ప్రభుత్వం తెచ్చుకుందామని సూచిస్తున్నారు. గత ఎన్నికల్లో పోలింగ్​ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించినా.. కొందరు ఓటును వినియోగించుకోలేదని గుర్తు చేశారు. ఈసారి తప్పకుండా ప్రతిఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని యువత సైతం సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారులు పోలింగ్​ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారని గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details