తెలంగాణ

telangana

Viveka_Murder_Case_Trial_Adjourned

ETV Bharat / videos

Viveka Murder Case Trial Adjourned: వివేకా హత్య కేసు విచారణ వాయిదా..! కోర్టు అనుమతితో అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలు మాటమంతి.. - Viveka Murder Case updates

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 5:36 PM IST

Viveka Murder Case Trial Adjourned: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి..హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టులో నేడు విచారణ జరిగింది. విచారణలో భాగంగా న్యాయవాదుల వాదోపవాదాలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. దాంతోపాటు వివేకా హత్య కేసులో జ్యుడీషియల్ ఖైదీలుగా ఉన్న ఆరుగురికి అక్టోబర్ 4వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది.

Lawyers Arguments on Viveka Murder Case: వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డిలు సీబీఐ కోర్టులో జరిగిన విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించిన అనుబంధ నేరాభియోగపత్రానికి సంబంధించిన పత్రాలు ఇవ్వాలని నిందితుల తరఫు న్యాయవాదులు మరోసారి కోర్టును కోరారు. గత విచారణలో ఈ నెల 22న పత్రాలు సమర్పిస్తామని సీబీఐ అధికారులు చెప్పినప్పటికీ.. ఇంకా ఆ పత్రాలను ఇవ్వలేదని ఉదయ్ కుమార్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  

Viveka Murder Case Hearing Adjourned to October 4: ఈ నేపథ్యంలో సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సీడీల రూపంలో ఇది వరకే అందజేశామన్నారు. 14వేల కాపీలున్న అభియోగపత్రాన్ని వచ్చే విచారణకల్లా అందజేస్తామన్నారు. న్యాయవాదుల వాదోపవాదాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం..విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. అయితే, నేటి విచారణకు భాస్కర్ రెడ్డి కోర్టుకు హాజరు కాలేదు. ఇప్పటికే ఆయనకు కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేయడంతో ఇవాళ ఉదయం పదిన్నరకు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. మరోపక్క కోర్టు అనుమతితో అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలు కోర్టు హాల్‌లో 10నిమిషాల పాటు మాట్లాడుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details