Viral Video Negligence of Police in the Road Accident : కళ్లెదుటే రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి.. చూసి చూడనట్లు జారుకున్న పోలీసులు - రోడ్డు ప్రమాదాన్ని చూసి పారిపోయిన పోలీసులు
Published : Oct 8, 2023, 4:11 PM IST
Negligence of Police in the Road Accident in RangaReddy : రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు బైకు ఢీ కొన్న ప్రమాదంలో మహిళా అక్కడిక్కడే మృతి చెందింది. కాగా అక్కడే ఉన్న పోలీసులు బాధితులను పట్టించుకోకుండా.. మెల్లగా జారుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగడపల్లి గ్రామానికి చెందిన భార్యభర్తలు బైక్‌పై వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడే ఉన్న భర్త తల మోదుకుంటూ బస్సు వెనుక పరుగులు తీసి బస్సును ఆపాడు.
కానీ అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు మాత్రం ప్రమాదాన్ని చూసినా.. వారు పట్టించుకోకుండా అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు.. సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాపాడాల్సిన పోలీసులే ఇలా బాధ్యాతరహితంగా ఉంటే ఎలా అంటు ప్రశ్నలు కొందరు వేస్తుంటే మరికొందరు వారి వ్యవహారంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు కోరుతున్నారు.