తెలంగాణ

telangana

auto over turned in hyderabad

ETV Bharat / videos

Viral Video Auto Overturned at Hyderabad Cable Bridge : కేబుల్​బ్రిడ్జ్​పై ఆటోబోల్తా...తృటిలో తప్పిన ప్రమాదం - hyderabad crime news

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2023, 5:26 PM IST

Auto Overturned at Hyderabad : ఎదురుగా వస్తున్న బైక్​ను తప్పించబోయిన ఓ  ఆటోబోల్తా కొట్టిన ఘటన దుర్గం చెరువు కేబుల్​బ్రిడ్జ్ వద్ద చోటుచేసుకుంది. ప్రమాద వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 22న తేదీన జూబ్లీహిల్స్ నుంచి ఐటీసీ కోహినూర్ వైపుగా వెళ్తున్న ఆటో అకస్మాత్తుగా బోల్తాకొట్టింది. డ్రైవర్ సెల్​ఫోన్ చూస్తూ వాహనం నడపుతున్న క్రమంలో.. ఎదురుగా వెళ్తున్న బైక్​ను గమనించలేదు. దీంతో ద్విచక్రవాహనానికి సమీపించగానే ఢీకొడుతుందనే భయంతోనే ఆటోను ఒక్కసారిగా కుడివైపునకు తిప్పాడు. ఫలితంగా వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది.

తృటిలో తప్పిన ప్రమాదం 

ఆటో బోల్తా కొట్టిన సమయంలో వెనుకనుంచి వచ్చిన కారు డ్రైవర్ చాకచక్యంతో పక్కకు తిప్పడంతో ప్రమాదం తప్పింది. లేకుంటే ఆటోని ఢీకొట్టి కారు సైతం పల్టీ కొట్టేదని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి ఆటోడ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్​తో పాటు మరొకరు ఉన్నట్లగా సమాచారం. వీరిద్దరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వాహనదారులు డ్రైవింగ్​లో ఉన్నప్పుడు సెల్​ఫోన్ వాడొద్దని పోలీసుశాఖ వారు పలుమార్లు హెచ్చరిస్తున్నా అవి పాటించకపోవడం వల్లనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details