పెళ్లి భోజనంలో పనీర్ పెట్టలేదని గొడవ.. బెల్టులతో కొట్టుకున్న వధూవరుల బంధువులు - పెళ్లిలో గొడవ
వివాహ విందులో పనీర్ పెట్టలేదని పెళ్లి కుమారుడి బంధువు హల్చల్ చేశాడు. దీంతో పెళ్లి వేడుకలో తీవ్ర దుమారం చెలరేగింది. వధువు, వరుడి కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు బెల్టులతో దాడులు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గొడవకు దిగిన కొందరిని అరెస్ట్ చేశారు. ఇరువర్గాల మధ్య రాజీ కుదరడం వల్ల అందరినీ విడిచిపెట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో జరిగిందీ ఘటన. ఈ దాడి దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.