తెలంగాణ

telangana

Vinodkumar Interesting Comments On BRS

ETV Bharat / videos

Vinod Kumar Hot Comments On BRS Leaders : 'సొంత పార్టీ నేతల వల్లే గత ఎన్నికల్లో ఓటమి' - తెలంగాణ తాజా రాజకీయ వార్తలు

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2023, 5:32 PM IST

Vinodkumar Hot Comments on BRS Leaders in Karimnagar :కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంట గ్రామంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ఆయన సభలో  ప్రసంగింస్తూ సొంత పార్టీపైనే పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత పార్లమెంట్​ ఎన్నికల సమయంలో తమ పార్టీ నేతల తీరును తప్పుపట్టారు. గత ఎన్నికల ప్రచార సమయంలో బండి సంజయ్​ పేదల ఫించన్​ రూ.1000లో రూ. 800 కేెంద్ర ప్రభుత్వం ఇస్తుందని అన్నారని... ఆ విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించకుండా మౌనంగా ఉండడం వల్లే తాను ఓటమి పాలయ్యానని వాపోయారు. ఈసారి ఎన్నికల్లో అయినా ఇటువంటి పొరపాట్లు జరగకుండా కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Vinodkumar Fired on Narendra Modi :అంతరిక్ష పరిశోధనల్లో చంద్రయాన్​ సక్సెస్​ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఘనతగా చెప్పుకోవడం సరికాదని బోయినపల్లి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details