తెలంగాణ

telangana

Clash Between Villagers And Sarpanch

ETV Bharat / videos

Clash Between Villagers And Sarpanch : నిధుల్లో గోల్​మాల్ చేశాడంటూ.. సర్పంచ్​పై చెప్పుతో దాడి - గ్రామ సభలో చెప్పుతో సర్పంచ్​ని కొట్టిన మహేశ్

By

Published : May 31, 2023, 8:16 PM IST

Villagers and Sarpanch Fight in Mahabubabad : గ్రామ సభలో గ్రామంలో అభివృద్ధి కుంటుపడి మౌలిక వసతులు కరువయ్యాయని.. నిధుల గోల్​మాల్​ను ప్రశ్నించి సర్పంచ్​పై చెప్పుతో దాడి చేసిన ఘటన మహబూబాబాద్​ జిల్లా మొట్ల తండా గ్రామ పంచాయతీలో చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ జరుగుతుండగా ఓ వ్యక్తి గ్రామంలో అభివృద్ధి పనులు జరగకుండానే బిల్లులను సర్పంచ్​ కాజేశారని ఆరోపించి అశ్లీలపదాలతో దూషించి చెప్పుతో దాడి చేశారు. దీంతో గ్రామ సభలో గ్రామస్థులు, సర్పంచ్ వర్గీయుల మధ్య ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామ కార్యదర్శి పరిస్థితులను అదపులోకి తెచ్చేందుకు గ్రామ సభను జూన్ 5వ తేదీకి వాయిదా వేసి సభను ముగించారు. పనులు చేయకుండానే సర్పంచ్ బిల్లులు ఎత్తుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఈ విషయంపై సర్పంచ్ సుమన్​ నాయక్​ను వివరణ కోరగా.. గ్రామంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తనపై వ్యక్తిగత కక్షతోనే వర్రే మహేశ్​ అనే వ్యక్తి దాడి చేశారని ఆరోపించారు. తనపై దాడి చేసిన మహేశ్​పై చర్యలు తీసుకుని  న్యాయం చేయాలని అధికారులను కోరారు. 

ABOUT THE AUTHOR

...view details