తెలంగాణ

telangana

విజయవాడ టు హైదరాబాద్ హైవే

ETV Bharat / videos

Vijayawada-Hyderabad Highway: నిరీక్షణకు తెర.. విజయవాడ-హైదరాబాద్ హైవేపై వాహనాల రాకపోకలకు లైన్ క్లియర్

By

Published : Jul 29, 2023, 3:16 PM IST

Vijayawada-Hyderabad highway Vehicles Allowed: రాష్ట్రంలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతూ.. ప్రధాన రహదారులను సైతం ముంచెత్తాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని ఐతవరం గ్రామం వద్ద విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలను అధికారులు అనుమతించారు. రహదారిని పూర్తిగా శుభ్రం చేసి రాకపోకలను పూర్తిస్థాయిలో అనుమతించారు. కాగా.. మునేరు వరద తీవ్రత వలన జాతీయ రహదారి పక్కన ఉన్న సిమెంట్ రైలింగ్ కొంతవరకు దెబ్బతింది. అయితే జాతీయ రహదారి అంతా బాగానే ఉంది. వరద ప్రవాహం వల్ల బురద మట్టి ఉండటంతో ఫైర్ ఇంజిన్​తో నీళ్లు కొట్టించి అధికారులు శుభ్రం చేయించారు. రెండు వైపులా వాహనాలను అధికారులు అనుమతించడంతో యథాస్థితిలో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు మునేరు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల జాతీయ రహదారిపైకి వరద చేరింది. దీంతో రహదారిపై 26 గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం రాత్రి నుంచి రాకపోకలకు పోలీసు అధికారులు అనుమతించటంతో లైన్​ క్లియర్​ అయ్యింది. 

ABOUT THE AUTHOR

...view details