Vijay Devarakonda Visit Yadadri Temple : యాదాద్రిలో విజయ్ దేవరకొండ.. నారసింహునికి ప్రత్యేక పూజలు - యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం
Published : Sep 3, 2023, 1:20 PM IST
Hero Vijay Devarakonda Visit Yadadri Sri Lakshminarasimha Swamy : యాదాద్రిలో సినీ హీరో విజయ్ దేవరకొండ సందడి చేశారు. తెలంగాణ ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. విజయ్ దేవరకొండతో పాటు అతని సోదరుడు బేబీ మూవీ హీరో ఆనంద్ దేవరకొండ, ఖుషీ మూవీ సభ్యులు కూడా దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన విజయ్ దేవరకొండకు ఆలయ ఈవో గీతారెడ్డి స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వాదం చేశారు. ఆ తర్వాత లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న.. అనంతరం గీతారెడ్డి దేవకొండ ఫ్యామిలీకి స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. కుటుంబంతో కలిసి ప్రత్యేక నిర్వహించారు. ఆలయం లోపల దర్శనం ముగించుకొని.. బయటకు వచ్చిన తర్వాత యాదాద్రి ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని విజయ్ దేవరకొండ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఆలయాన్ని నిర్మించిందని హర్షం వ్యక్తం చేశారు. గతంలో కంటే ఇప్పుడు ఆలయం ఎంతో గొప్పగా ఉందన్నారు. సినీ హీరో వచ్చిన సమయంలో, భక్తులు, అభిమానులు సెల్ఫీలు దిగారు.