బుల్డోజర్లతో భారీ ర్యాలీ నిర్వహించిన పటాన్‌చెరు బీజేపీ అభ్యర్థి - వీడియో వైరల్ - పటాన్‌చెరులో బీజేపీ అభ్యర్థి నామినేషన్
Published : Nov 9, 2023, 10:02 PM IST
Video Viral Patancheru BJP Candidate Bulldozer Rally:ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మార్క్ పాలన అనగానే అందరికీ గుర్తు వచ్చేది నేరగాళ్ల ఇళ్లపై బుల్డోజర్‌లను నడిపించే సంస్కృతి. బుల్డోజర్ పేరు ఎత్తగానే ఇటు దేశంలోనూ.. అటు ఉత్తరప్రదేశ్‌లోనూ బీజేపీ నేత యోగినే గుర్తుకు వస్తారు. ఇప్పుడు అదే బుల్డోజర్ పాలనను వివిధ రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు తీసుకువస్తామని వ్యాఖ్యలు చేశారు. అయితే నామినేషన్ల సందర్భంగా అదే పద్ధతిని తెలంగాణలో సైతం బీజేపీ అధికారంలోకి వస్తే తీసుకువస్తామని సంకేతాలు ఇస్తూ.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు బీజేపీ అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్ బుల్డోజర్ల(జేసీబీ)లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ బుల్డోజర్‌లతో నిర్వహించిన భారీ ర్యాలీలో.. పెద్ద మొత్తంలో జనాలు పాల్గొన్నారు. బుల్డోజర్లు ముందు నడుస్తుంటే వెనుక పటాన్‌చెరు బీజేపీ అభ్యర్థి ర్యాలీ చేపట్టారు. దీంతో ఒక్కసారిగా బుల్డోజర్ల ర్యాలీ అందరి దృష్టిని ఆకర్షించి.. ఈ పదం తెగ క్రేజ్ పెరిగిపోయింది. వినూత్నంగా నిర్వహించిన ఈ ర్యాలీ పటాన్‌చెరులో ఇప్పుడు చర్చనీయాంశమైంది.