దిల్‌సుఖ్‌నగర్‌లో ఐదేళ్ల బాలుడిపై కుక్క దాడి - సీసీకెమెరాలో రికార్డైన దృశ్యాలు - దిల్‌సుఖ్‌నగర్‌లో బాలుడిపై కుక్క దాడి
Published : Dec 15, 2023, 4:38 PM IST
Video Viral Dog Attack on 5 Years Boy in Dilsukhnagar : హైదరాబాద్లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుని తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం దిల్‌సుఖ్‌నగర్‌లోని శాంతినగర్కి చెందిన బిట్టు (5) ఇంటి ఇద్దరు అబ్బాయిలతో కలిసి ఇంటిముందు ఆడుకుంటున్నాడు. అటువైపుగా వచ్చిన కుక్కలు ఆ ముగ్గురిని వెంబడించాయి. దీంతో పరుగులు పెడ్డిన ఆ పిల్లల్లో బిట్టు కిందపడబోతుండగా వెంబడించిన కుక్క ఇంటి గేట్లోకి ప్రవేశించి బాలుడిని కరిచింది. దీంతో తీవ్ర గాయాలపాలైన బాలుడుని నారాయణగూడలోని ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
వీధుల్లో కుక్కలు తిరుగుత్నాయని అధికారులకి అనేకసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. కనీసం ఇప్పుడైన అధికారులు స్పందించాలని కోరుతున్నారు. నగరంలో కుక్కల దాడులు రోజురోజుకు పెరుగుతున్నా, అధికారులు మాత్రం ఫిర్యాదు చేసిన సమస్యలపై దృష్టి సారించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.