తెలంగాణ

telangana

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్​లో పెద్దపులి బీభత్సం

ETV Bharat / videos

గాండ్రిస్తూ దూసుకొచ్చిన పెద్దపులి.. భయంతో వణికిపోయిన టూరిస్ట్​లు.. చివరకు ఏమైంది? - జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్​లో పెద్దపులి బీభత్సం

By

Published : Apr 27, 2023, 6:27 PM IST

Updated : Apr 27, 2023, 6:35 PM IST

సఫారీ రైడ్‌కు వెళ్లిన కొందరు పర్యటకులకు భయానక అనుభవం ఎదురైంది. వాహనంలో కూర్చొని పార్కును సందర్శిస్తూ ఫొటోలు తీసుకున్న పర్యటకుల బృందంపైకి ఓ పులి గాండ్రిస్తూ దూసుకొచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో వారంతా భయంతో కేకలు పెడుతూ వణికిపోయారు. ఉత్తరాఖండ్ నైనితాల్ జిల్లాలో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్​లో ఈ ఘటన జరిగింది. అందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. 

పార్క్​లో ఉన్న జంతువులను ముఖ్యంగా పులులు, క్రూరమృగాలను చూసేందుకు పర్యటకులు పార్క్ వెలుపల ఏర్పాటు చేసిన సఫారీ వాహనంలో ఎక్కి అడవి లోపలికి వస్తారు. అలా సఫారీ జీప్​లో ఎక్కిన కొందరు టూరిస్టులు జంతువులను చూస్తూ పులులు ఉండే ప్రాంతానికి చేరుకున్నారు. ఈ క్రమంలో వారికి ఓ పెద్దపులి కనిపించింది. జనాన్ని చూసిన ఆ పులి ఒక్కసారిగా ఆగ్రహానికి గురైంది. కోపంతో టూరిస్టులున్న వాహనంపైకి దూసుకొచ్చేందుకు ప్రయత్నం చేసింది. దీంతో జీప్ లోపల ఉన్న పర్యటకులు భయంతో కేకలు వేయడం ప్రారంభించారు. ఇది గమనించిన డ్రైవర్ పులికి దూరంగా జీప్​ను వెనక్కి పోనిచ్చాడు. అదృష్టవశాత్తు ఆ పులి శాంతించి తిరిగి అడవిలోకి వెళ్లిపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే జీప్ నడిపిన డ్రైవర్ పులిని రెచ్చగొట్టాడనే కారణంతో అతడితో పాటు వాహన యజమానిపై వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు రాంనగర్ ఫారెస్ట్ డివిజన్ డీఎఫ్‌ఓ కుందన్ కుమార్. అంతేకాకుండా సీతాబని టూరిజం జోన్‌లోకి ప్రవేశించిన వాహనంతోపాటు డ్రైవర్​పై శాశ్వతంగా నిషేధం విధించేలా చర్యలు తీసుకున్నారు అధికారులు.

Last Updated : Apr 27, 2023, 6:35 PM IST

ABOUT THE AUTHOR

...view details