లగ్జరీ కారులో రేషన్ షాప్‌కు.. 'నిరుపేద' ఆప్ నేత వీడియో వైరల్ - punjab pds luxury car
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత.. ఖరీదైన కారులో వచ్చి రేషన్ దుకాణంలో సరకులు తీసుకున్నారు. ఖాదుర్ సాహిబ్ నియోజకవర్గంలోని ధుందన్ గ్రామ పంచాయతీ సభ్యుడు జగ్దీప్ సింగ్ రంధవా.. పీడీఎస్ షాప్ నుంచి గోధుమ సంచులను తన కారులోకి ఎక్కిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే మజిందర్ సింగ్ లాల్పుర స్పందించారు. ఘటనపై దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఎదైనా తప్పు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. పంజాబ్‌లోని హోషియాపుర్లోనూ ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. బీపీఎల్ కార్డు ఉన్న ఓ వ్యక్తి ఆడీ కారులో వచ్చి సరకులు తీసుకెళ్లాడు. దీనిపై ఆ రాష్ట్రంలో దుమారం చెలరేగింది. రేషన్ పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయనే చర్చ మొదలైంది.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST