Vennela waterfalls in Manuguru : కన్నులవిందుగా.. వెన్నెల జలపాతం హొయలు
Vennela waterfalls in Bhadradri Kothagudem : ఉపరితలద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకల నుంచి వచ్చిన చేరుతున్న కొత్తనీటితో నదులు, జలపాతాలు కొత్త అందాలను సంతరించుకుంటున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని రథం గుట్టపై నుంచి ప్రవహిస్తున్న వెన్నెల జలపాతం సందర్శకులకు కనువిందు చేస్తుంది. వర్షానికి పైనుంచి వస్తున్న నీటి ప్రవహం గుట్టపై నుంచి జాలువారుతూ.. పాల నురుగులా జలపాతం ఆకర్షిస్తోంది. జలపాతం వద్దకి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. కొందరు యువకులు గుట్టపైకి ఎక్కి జలపాతం పైభాగానికి చేరుకుంటున్నారు. వర్షంతో సెలవులు రావడంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా జలపాతం వద్ద ఆనందంగా గడుపుతున్నారు. రథం గుట్ట చుట్టూ మరో రెండు జలపాతాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. వెన్నెల జలపాతం వద్దకు చేరుకునేందుకు అటవీశాఖ రహదారిని ఏర్పాటు చేయడంతో పాటు, ఆ ప్రాంతంలో అర్బన్ పార్కుని అభివృద్ధి చేసింది. అర్బన్ పార్కులో ఏర్పాటు చేసిన కుటీరాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.