తెలంగాణ

telangana

ETV Bharat / videos

Venkaiahnaidu intimate meeting: విశాఖలో వెంకయ్యనాయుడు ఆత్మీయ సమావేశం.. కిషన్​రెడ్డి భావోద్వేగం - Venkaiah Naidu gets emotional in Visakha

🎬 Watch Now: Feature Video

కన్నీళ్లు పెట్టుకున్న వెంకయ్యనాయుడు

By

Published : Jun 23, 2023, 10:28 PM IST

Updated : Jun 23, 2023, 10:41 PM IST

Kishan Reddy Gets Emotional: విశాఖలో '50 ఏళ్ల ప్రజా జీవనం సేవానుబంధం - సహచర బృందం' పేరుతో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు  ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని భావోద్వేగానికి గురయ్యారు. 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో వివిధ దశల్లో కలిసి పని చేసిన వారిని వెంకయ్యనాయుడు దంపతులు సన్మానించారు. వారితో కలిసి పని చేసిన రోజులను వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. వాహన డ్రైవర్ల నుంచి సీనియర్ అధికారుల వరకూ అందరినీ సత్కరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. వెంకయ్యనాయుడి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు మరియు వెంకయ్యనాయుడు తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.   

Last Updated : Jun 23, 2023, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details