Vendors Threw Flowers In Flood Hyderabad : భారీ వర్షంతో ఇళ్లలోనే జనం.. గిరాకీ లేక పువ్వులను వరదలో పారబోసిన వ్యాపారులు
Published : Sep 5, 2023, 2:51 PM IST
Vendors Threw Flowers In Flood Hyderabad :హైదరాబాద్నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. రోడ్లు, పలు కాలనీలు జలమయం కావడంతో ప్రజల రాకపోకలకు కష్టంగా మారింది.
Hyderabad Rains Today :రెండ్రోజులుగా కురుస్తున్న వానలకు ప్రజలు బయటకు రాకపోవడంతో చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షాల కారణంగా మార్కెట్‌కు కొనుగోలుదారులు ఎవ్వరు రావడం లేదని దాని వల్ల సరకు పాడైపోతుందని, నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రావణ మాసం కావడంతో లాభాలు వస్తాయని ఆశించిన వ్యాపారులకు వర్షం వారికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. కూరగాయలు, పువ్వులు అమ్ముకునే వారు వర్షానికి పాడైపోతున్నాయని కలత చెందుతున్నారు. గుడిమల్కాపూర్‌లో పువ్వులు కొనేందుకు ఎవ్వరు రాకపోవడంతో వ్యాపారులు పూలన్నింటిన వరదనీటిలో పారబోశారు.
Hyderabad Rains Losses Vendors :నగరంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుడిమల్కాపూర్ పూల మార్కెట్లో వ్యాపారాలు పెద్దగా లేక రూ.10కు కిలో చామంతి పూలు ఇస్తున్న తీసుకునేవారు లేక రైతులు, దుకాణదారులు వాటిని నీటిలో పడేస్తున్నారు. పూలు అమ్ముడుపోతేనే పూట గడుస్తుందని.. వర్షం కారణంగా నష్టపోయామని వాపోతున్నారు.