Variety Palabhishekam To KCR Cut Out in Hyderabad : కేసీఆర్ అంటే ఆ మాత్రం ఉంటది మరి.. 50 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసి పాలాభిషేకం - బేహంబజార్లో కేటీఆర్ కటౌట్‌కు పాలాభిషేకం
Variety Palabhishekam To KCR Cut Out in Hyderabad : రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ.. హ్యాట్రిక్ విజయం కోసం విపక్షాలను ఎదుర్కోవడానికి కేసీఆర్ సర్కార్ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. దీంతో బీఆర్ఎస్ నేతల్లో జోష్ పెరిగి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ బేగంబజార్‌లో గోశామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకురాలు మమత సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల 50 ఫీట్ల భారీ కటౌట్ ఏర్పాటు చేసి పాలాభిషేకం, పుష్పాభిషేకం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, రైతు రుణమాఫీ, మెట్రో విస్తరణ, అనాథల సంక్షేమం కోసం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలపై బీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. గోశామహల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేస్తామని.. మమత సంతోష్ గుప్తా స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు.