తెలంగాణ

telangana

Vande Bharath Gaurav Train

ETV Bharat / videos

వందే భారత్ గౌరవ్ ట్రైన్ ఎక్కారా...? - వందే భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు

By

Published : Apr 18, 2023, 4:11 PM IST

Vande Bharath Gaurav Train: గంగా పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేకంగా వందే భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రారంభమైంది.  సికింద్రాబాద్​ నుంచి ప్రారంభం అయ్యే ఈ ట్రైన్ మొదట పూరికి వెళ్తుంది. అక్కడి నుంచి కాశీకి బయలుదేరుతుంది. చిన్నారులు, వయోవృద్ధులు సహా అన్ని వయసుల వారు ఈ ట్రైన్​లో యాత్రకు వెళ్లారు. ముఖ్యంగా గంగా పుష్కరాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఈ టూరిస్ట్ ట్రైన్​ను ప్రారంభించారు. దీంట్లో ప్రయాణిస్తున్న వారు రైలు చాల సౌకర్యవంతంగా అన్ని సదుపాయాలతో ఉందని తెలిపారు. ఈ రైల్లో అన్ని వయసుల వారు ప్రయాణించడానికి తగిన ఏర్పాట్లు చేశారని యాత్రకు వెళ్లే వారు తెలిపారు. సదుపాయాలతో పాటు ట్రైన్ పరిశుభ్రంగా ఉందని వారు తెలిపారు. పుష్కరాల కోసం రైల్వే అధికారులు ఇలాంటి సదుపాయాలు కల్పించడం పట్ల వయోవృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు.  మొదటి సారి ప్రారంభించిన వందే భారత్ గౌరవ రైలులో ప్రయాణించడం సంతోషంగా ఉందన్నారు. ​ 

ABOUT THE AUTHOR

...view details