తెలంగాణ

telangana

Vaikunta Ekadashi Celebrations In Yadadri

ETV Bharat / videos

యాదాద్రిలో కన్నులపండువగా అధ్యయనోత్సవాలు - కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చిన నరసింహ స్వామి - వెన్న కృష్ణుడి అలంకారంలో నరసింహ స్వామి

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2023, 2:49 PM IST

Vaikunta Ekadashi In Yadadri: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఈనెల 23వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు 28 తేదీ వరకు జరగనున్నాయి. ఆరు రోజుల పాటు వివిధ రకాల అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చే యాదగిరీశుడు నాలుగవ రోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా ఇవాళ వెన్న కృష్ణుడి అలంకారంలో కనువిందు చేశాడు. వేద మంత్రాలు, మంగళ వాద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారిని సేవపై ఊరేగించారు. 

Yadadri Lakshmi Narasimha Swamy Adhyayana Utsavam  : ఆలయ అర్చకులు స్వామి వారిని వెన్న కృష్ణుడి అలంకారంలో సేవ చూడముచ్చటగా ఉండే విధంగా రక రకాల పుష్పాలతో అలంకరించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల, వేదపండితుల వేదపారాయణాలు దివ్య ప్రబంధ పారాయణల మధ్య ప్రత్యేక పూజలతో స్వామివారి నాలుగవ రోజు అధ్యయనోత్సవాలు ఘనంగా జరిగాయి. అనంతరం వెన్నెకృష్ణుడి అవతార విశిష్టతను ఆలయ అర్చకులు తెలియజేశారు. అధ్యయనోత్సవాల సందర్భంగా శాశ్వత కల్యాణాలు, శాశ్వత బ్రహ్మోత్సవాలు, సుదర్శన హోమం రద్దు చేసినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details