'ఆ సినిమాలన్నింటికీ రైటర్ నేనే.. క్రెడిట్ మాత్రం వాళ్లకే!' - krishna vamsi uttej movies
రామ్‌గోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి వచ్చిన టాలెంటెడ్ యాక్టర్, రైటర్ ఉత్తేజ్. రామ్‌గోపాల్ వర్మ తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలకు ఉత్తేజ్ రైటర్, యాక్టర్‌గా పనిచేశారు. మనీ, మనీమనీ, అంతం, గోవిందా గోవిందా, రాత్రి ఇలా పలు సినిమాలకు పూర్తిస్థాయిలో రైటర్‌గా పనిచేశారు ఉత్తేజ్. అలాగే కృష్ణవంశీ తీసిన సినిమాల్లో 'చందమామ' వరకు ఉత్తేజ్ రైటర్, యాక్టర్‌గా పని చేశారు. ఇన్నేళ్ల కెరీర్లో ఆర్జీవీ, కృష్ణవంశీ తప్ప మిగతా వాళ్ల సినిమాల్లో ఎందుకు అంతగా అవకాశాలు రాలేదని అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పారు ఉత్తేజ్. 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన క్రమంలో.. తనకు అవకాశాలు ఎందుకు రాలేదు? దానికి గల కారణాలను వివరించారు.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST