తెలంగాణ

telangana

students vandalized campus uttaranchal university

ETV Bharat / videos

యూనివర్సిటీలో విద్యార్థుల వీరంగం.. లేడీ వార్డెన్​ వేధింపులు.. క్యాంపస్​లోని సామగ్రి ధ్వంసం - క్యాంపస్​ పరిసరాలు ధ్వంసం ఉత్తరాంచల్​ యూనివర్సటీ

By

Published : Mar 19, 2023, 10:44 PM IST

ఉత్తరాఖండ్​లో ఉత్తరాంచల్​ యూనివర్సిటీ విద్యార్థులు వీరంగం సృష్టించారు. ఓ మహిళ వార్డెన్​ వేధింపులకు గురైందని విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయమై విశ్వవిద్యాలయం అధికారులకు వ్యతిరేకంగా నిరసన తెలిజేశారు. క్యాంపస్​ పరిసరాలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అసలు ఏం జరిగిందంటే.. ఉత్తరాంచల్​ యూనివర్సిటీ చీఫ్​​ వార్డెన్​ తనను వేధింపులకు గురిచేశాడని దర్సల్​ అనే మహిళ వార్డెన్​ ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా యాజమాన్యం పట్టించుకోలేదు. చీఫ్​ వార్డెన్​పై చర్యలు తీసుకోలేదు. దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు.. యూనివర్సిటీకి చెందిన యూఐటీ కాలేజీ వద్ద విధ్యంసం సృష్టించారు. బైక్​లను కర్రలతో పగులగొట్టారు. అందరూ ఒక చోట గుమిగూడి 'వి వాంట్​ జస్టిస్​' అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ, పోలీసులు క్యాంపస్​లోకి రాకుండా విద్యార్థులు గేట్​కు తాళం వేశారు. మహిళ వార్డెన్​ ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. అయితే, దీనికి సంబంధించి యూనివర్సిటీ యాజమాన్యం ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని చెప్పారు. ఒకవేళ వారు ఫిర్యాదు చేస్తే.. దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details