Uttam Kumar Reddy, Telangana Election results 2023 Live : 'అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు తిప్పికొట్టారు' - Uttam Kumar Reddy On Assembly Elections Results
Published : Dec 3, 2023, 1:50 PM IST
Uttam Kumar Reddy, Telangana Assembly Election Results 2023 Live :తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. పటిష్ఠ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మెజార్టీతో గెలుస్తుందన్న అంచనాలతో కాంగ్రెస్ పార్టీ వరుస విజయం ఖాతాలో వేసుకుంటోంది. అశ్వారావుపేట అభ్యర్థి ఆదినారాయణరావు విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై ఆదినారాయణ గెలుపొందారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు.
నియంతృత్వాన్ని తెలంగాణ ప్రజలు హర్షించరని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మెజార్టీ ఆధారంగా సీఎంని నియమిస్తారా అని ఓ విలేకరు ప్రశ్నించగా. ఓట్ల లెక్కింపు తర్వాత అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో, బీజేపీ ముందంజలో ఉందని ప్రశ్నించగా. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు పూర్తి ఫలితాలు తెలియదని, ఆ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై తనకు అవగాహన లేదని వివరించారు.