Uttam Kumar Reddy Interesting Comments : "50 వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటా"
Published : Oct 24, 2023, 4:45 PM IST
Uttam Kumar Reddy Interesting Comments: సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 50వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని.. ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని హుజూర్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు. స్థానికంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి 3 వందల ఎకరాలు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. కార్యకర్తలు అందరూ.. సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా వేపల సింగారంలో పలువురు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారికి కాంగ్రెస్‌లో సముచిత స్థానం కలిపిస్తామమన్నారు.
Uttam Kumar Reddy Latest comments : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో జరిగే 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ ప్రధాని కావడం ఖాయమని అన్నారు. రాజకీయంగా నష్టపోతున్నా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని తెలిపారు.