తెలంగాణ

telangana

Uttam Kumar Ration Rice Distribution in Telangana

ETV Bharat / videos

రేషన్ బియ్యాన్ని 70శాతం కుటుంబాలు తినడం లేదు : ఉత్తమ్​కుమార్​ రెడ్డి - పౌరసరఫరాల కార్పొరేషన్ రుణాలపై ఉత్తమ్ వ్యాఖ్యలు

By ETV Bharat Telangana Team

Published : Dec 16, 2023, 3:48 PM IST

Uttam Kumar Ration Rice Distribution in Telangana : రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో పౌరసరఫరాల శాఖపై ఉత్తమ్ స్పందించారు. గత ప్రభుత్వం చర్యలతో పౌరసరఫరాలశాఖ 56 వేలకోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు. దానికి సంవత్సర వడ్డీ రూ.30 వేల కోట్లు ఉందని తెలిపారు. సివిల్ కార్పొరేషన్ అప్పులు ప్రస్తుతం రూ.11వేల కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. 

రేషన్‌కార్డు ఉన్న ప్రతి లబ్దిదారుడికి కేంద్రప్రభుత్వం 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం కిలో చొప్పన ఇస్తోందన్నారు. బియ్యం నాణ్యత లేకపోవడంతో 70 నుంచి 75 శాతం కుటుంబాలు ఆ బియ్యం తినడం లేదని తెలిపారు. ప్రభుత్వం కిలోకి రూ.39 ఖర్చు చేసి ప్రజలకు అందిస్తున్నా నాణ్యత లేకపోవడం వల్ల వారు తినడం లేదనన్నారు.   అధిక శాతం బియ్యం నిల్వలు రీసైక్లింగ్ ద్వారా దారిమళ్లుతున్నాయని శాసన మండలిలో చెప్పారు. ఆ విధానాన్ని మార్చేందుకు సభ్యులు సలహాలు ఇవ్వాలని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details