తెలంగాణ

telangana

కారు బానెట్​పై యువతి ఇన్​స్టా రీల్​.. పోలీసుల ఘలక్​.. రూ.15,500 ఫైన్​!

ETV Bharat / videos

కారు బానెట్​పై యువతి ఇన్​స్టా రీల్​.. పోలీసులు గట్టి షాక్​​.. రూ.15వేలు ఫైన్​! - police challaned to girl sitting on car bonnet

By

Published : May 21, 2023, 8:22 PM IST

ఇన్​స్టాగ్రామ్​లో లైక్స్​, కామెంట్స్​, వ్యూస్​ కోసం కొందరు యువతీయువకులు ఎంతటి సాహసాలు చేయటానికైనా వెనకాడట్లేదు. కొందరు కొండలపైకి ఎక్కి వీడియోలు చేస్తే.. మరికొందరు రైల్వే ట్రాక్స్​ పైనే ప్రమాదకర రీతుల్లో రీల్స్​ చేస్తున్నారు. అయితే ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన యువతి.. ఏకంగా కారు బానెట్​పైన కూర్చుని ఇన్​స్టా రీల్​ చేసింది. 

ప్రయాగ్​రాజ్ జిల్లాలోని సివిల్ లైన్ ఏరియాకు చెందిన వర్ణిక.. సఫారీ లగ్జరీ కారు బానెట్‌పై కూర్చొని మరీ ఓ ఫేమస్​ పాటకు రీల్​ చేసింది. పెళ్లికుమార్తె వేషధారణలో పోజులిచ్చింది. షూట్​ చేసిన ఈ రీల్​ను తన ఇన్​స్టా ఖాతాలో పోస్ట్​ చేయడం వల్ల అది కాస్త వైరల్​గా మారి ట్రాఫిక్​ పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆమెకు గట్టి షాకిచ్చారు పోలీసులు. వీడియోలో కనిపించిన వాహనం నంబర్​ప్లేట్ ఆధారంగా యువతి వివరాలను గుర్తించారు. ఏకంగా రూ.15,500ల జరిమానా విధించి​ హెచ్చరించారు. అయితే ఇదే యువతిపై ఇంతకుముందు కూడా హెల్మెట్ ధరించకుండా స్కూటీ నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు చలానా వేశారు అధికారులు.

ABOUT THE AUTHOR

...view details