తెలంగాణ

telangana

మోదీ సర్కార్ జిందాబాద్​ నినాదాలు చేస్తున్న చిలుక

ETV Bharat / videos

చిలుక నోట 'మోదీ సర్కార్ జిందాబాద్'​.. జై శ్రీరాం అంటూ చక్కని పలుకులు! - హిందూస్థాన్​ జిందాబాద్​ నినాదాలు చేస్తున్న చిలుక

By

Published : Aug 1, 2023, 7:46 PM IST

Parrot Talking Video : మోదీ సర్కార్​ జిందాబాద్​ అంటూ చక్కగా పలుకుతోంది ఓ రామచిలుక. హిందుస్థాన్ జిందాబాద్ అని అంటోంది. ​జై శ్రీరామ్ నినాదాలు సైతం చేస్తోంది. మనుషుల వలే మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటోంది. బిహార్​లోని జముయి జిల్లాకు చెందిన మంటూ అనే వ్యక్తికి చెందిన చిలక.. ఇలా చక్కగా మాట్లాడుతోంది. లక్ష్మీపుర్ పరిధిలోని తేటారియా గ్రామానికి మంటూ.. నాలుగేళ్ల క్రితం స్థానిక అటవీ ప్రాంతం నుంచి ఈ చిలుకను ఇంటికి తీసుకువచ్చాడు. అప్పటి నుంచి దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఇలా బుజ్జి బుజ్జి మాటలు నేర్పుతున్నాడు. మంటూ ప్రధానికి అభిమాని కావడం వల్ల.. మోదీ జిందాబాద్​ అనే మాటలు నేర్పించాడు. చిలుకకు ఆకలి వేసినప్పుడు ఆహారం కోసం మంటూను అడుగుతుంది. దాహం వేసినప్పుడు నీళ్లను సైతం ఇవ్వమని కోరుతుంది. దీంతో ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో ఈ చిలుక చర్చనీయాంశంగా మారింది.

చిలుకకు బాదం పప్పు, జీడిపప్పు, ఎండుద్రాక్షతో పాటు వివిధ రకాల పండ్లు ఆహారంగా పెడుతున్నట్లు మంటూ తెలిపాడు. అన్నం, రోటీ, పాల మీగడ వంటి పదార్థాలను కూడా రామచిలుక తింటుందని వెల్లడించాడు. చిలుక తన ఇంట్లోనే స్వేచ్ఛగా తిరుగుతుందని మంటూ పేర్కొన్నాడు. పిల్లులు, గద్దల భయంతో దానిని పంజరంలో ఉంచుతానని తెలిపాడు. చాలా సార్లు రామ చిలుక బయటకు వెళ్లిందని.. అనంతరం తిరిగి ఇంటికి వచ్చిందని మంటూ చెప్పాడు.  

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details