తెలంగాణ

telangana

Unique Election Campaign in Wardhannapet

ETV Bharat / videos

ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ వినూత్న ప్రచారం - గుర్రంపై ఇంటింటికీ వెళుతూ ఓట్ల అభ్యర్థిన - తెలంగాణ ఎన్నికల ప్రచారం

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2023, 9:37 PM IST

Unique Election Campaign in Wardhannapet :  సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి గడువు సమీపిస్తున్న వేళ అభ్యర్థులు వినూత్న రీతుల్లో ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు పడరాని పాట్లు పడుతూనే తమకు మద్దతు తెలిపాలని ఓటర్లను వేడుకుంటున్నారు. ప్రజల్లోకి వెళుతూ కొందరు నాయకులు.. వంటలు చేస్తూ మరికొందరు.. బట్టలు కుడుతూ.. కూరగాయలు అమ్ముతూ.. ఇలా వివిధ రకాలుగా ప్రచారం చేస్తున్నారు. 

ఓటర్లతో మమేకమై ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే.. ఏం జరుగుతుందో ప్రజలకు వివరిస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో గుర్రంపై సవారీ చేస్తూ ఓటర్లను ఆకర్షించారు. తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తొమ్మిదిన్నరేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యేకు గ్రామస్థులు, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.  

ABOUT THE AUTHOR

...view details