Nitin Gadkari Visited Tirumala: ప్రజాసేవ చేసే శక్తిని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థించా: నితిన్ గడ్కరీ
Union Minister Nitin Gadkari Visited Tirumala: తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి తోమాల సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు గడ్కరీ దంపతులకు వేద ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. దేశం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని కోరినట్లు చెప్పారు. ప్రజాసేవ చేసే శక్తిని తనకు ప్రసాదించామని ప్రార్థించినట్లు గడ్కరీ తెలిపారు.
జాతీయ రహదారులు నేడు జాతికి అంకితం: తిరుపతి జిల్లాలోని పలు జాతీయ రహదారులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం జాతికి అంకితం చేయనున్నారు. తారకరామ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో నాయుడుపేట-కృష్ణపురం పోర్టు వరకు 13వందల 99 కోట్ల రూపాయలు, చిల్లకూరు క్రాస్ నుంచి తూర్పు కనుపూరు వరకు 909 కోట్ల రూపాయలు, తమ్మినపట్నం నుంచి నరికలపల్లె వరకు 610 కోట్ల రూపాయలతో నిర్మించిన జాతీయ రహదారులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.