Prathidwani : ఉమ్మడి పౌరస్మృతి.. అమలు చేయడం ఎంత వరకు సాధ్యం..?
Uniform Civil Code in India : ఒకే దేశం.. ఒకే పౌరస్మృతి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అన్నీ అనుకున్న మేర జరిగితే రానున్న శీతకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో బిల్లు పెడతారన్న సంకేతాలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాల్లో ఉమ్మడి పౌర స్మృతి విషయం ఆసక్తి రేపుతుంది. వివాహం, విడాకులు, ఆస్తి, వారసత్వ హక్కుల విషయంలో పౌరులందరికీ సమన్యాయం సాధనకు యూసీసీ అవసరమని ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది బీజేపీ. ఆ మేరకే దిల్లీ హైకోర్టుకు గతేడాది మొదటిసారి ప్రమాణ పత్రం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు లా కమిషన్ సంప్రదింపులతో యూసీసీని మరింత ముందుకు తీసుకుని వెళ్తోంది. అయితే ఇప్పుడు జరగాల్సిన క్రతువును మోదీ ప్రభుత్వం ఇంతే సమర్థంగా ముందుకు తీసుకుని వెళ్లగలదా? భిన్న మతాలు, సంప్రదాయాలు, సంస్కృతులున్న దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయడం ఎంత వరకు సాధ్యం? సుప్రీం కోర్టు ఈ విషయంపై ఏమని స్పందించింది? మన దేశంలో ఉమ్మడి పౌరస్మృతి సాధ్యమవుతోందా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని..