బైక్‌పై వెళ్తూ స్నానం.. సబ్బు రాసుకుని వర్షంలో తడుస్తూ.. - కాన్పుర్‌లో వర్షంలో స్నానం చేసిన యువకులు
Bath on Bike : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇద్దరు యువకులు విచిత్రంగా ప్రవర్తించారు. వర్షం కురుస్తున్నప్పడు ఒంటికి సబ్బు రాసుకుని.. బైక్‌పై అర్ధనగ్నంగా ప్రయాణిస్తూ స్నానం చేశారు. ఈ ఘటనను అటుగా వెళ్తున్న వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. ప్రస్తుతం వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ జరిగింది..కాన్పుర్ నగరంలో వర్షం కురుస్తుండటం వల్ల వాతావరణం చల్లగా మారింది. దీంతో ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో ట్రెండ్ కావడానికి విచిత్రంగా ప్రవర్తించారు. ఒంటికి సబ్బు రాసుకుని.. బైక్‌పై అర్ధనగ్నంగా, ప్రమాదకరంగా ప్రయాణిస్తూ స్నానం చేశారు. దీన్ని వాహనదారులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం వల్ల.. వైరల్‌గా మారింది. ఈ బైక్ నంబర్ యూపీ 78తో మొదలైంది. దీంతో ఈ బైక్.. కాన్పుర్‌కు చెందినదిగా భావిస్తున్నారు.
ఈ వీడియోపై కాన్పుర్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. బహిరంగ ప్రాంతంలో వాహనదారులకు ఇబ్బందికరంగా ప్రవర్తించిన ఇద్దరి కోసం వెతుకుతున్నారు. ట్రాఫిక్ డీసీపీ రవీనా త్యాగి ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. విచారణకు ఆదేశించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే, వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. ఈ వీడియో ఫన్నీగా ఉందని కొందరు కామెంట్లు పెట్టగా.. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.