తెలంగాణ

telangana

Two Year Girl Died under School Bus

ETV Bharat / videos

డ్రైవర్ నిర్లక్ష్యం, అన్నను బస్సు ఎక్కించేందుకు వచ్చిన రెండేళ్ల పాప మృతి - హబ్సిగూడలో పాప మృతి

By ETV Bharat Telangana Team

Published : Jan 4, 2024, 5:15 PM IST

Two Year Girl Died under School Bus :హైదరాబాద్​ హబ్సిగూడలోని రవీంద్రనగర్​లో విషాదం చోటు చేసుకుంది. ఓ స్కూల్​ బస్సు కింద పడి రెండేళ్ల పాప మృతి చెందింది. పాప తండ్రి తన కమారుడిని స్కూల్​ బస్సు ఎక్కించేందుకు రోడ్డుపైకి వచ్చారు. తన తండ్రి, అమ్మమ్మతో పాటు చిన్నారి జావ్లానా సైతం సోదరుడిని స్కూల్​కు పంపేందుకు వెళ్లింది. ఈ క్రమంలో పాప తండ్రి డ్రైవర్​తో మాట్లాడుతుండగా చిన్నారి జావ్లానా అమ్మమ్మ దగ్గరి నుంచి తన తండ్రి దగ్గరకు పరుగులు తీసింది.  

Two Year Baby Died at Habsiguda :ఈ నేపథ్యంలో బస్సు డ్రైవర్​ వాహనం తీస్తుండగా ప్రమాదవశాత్తు పాప జావ్లానా టైర్​ కింద పడి మృత్యువాత పడింది. డ్రైవర్​ నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ, జాన్సన్ గ్రామర్​ స్కూల్​ ముందు ధర్నా చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పాప మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details