తెలంగాణ

telangana

Two RTC Buses Collided

ETV Bharat / videos

ఒకదానికొకటి ఢీకొన్న ఆర్టీసీ బస్సులు - తీవ్రంగా గాయపడిన 10 మంది ఆసుపత్రికి తరలింపు - పెద్దపల్లిలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి

By ETV Bharat Telangana Team

Published : Nov 19, 2023, 1:12 PM IST

Two RTC Buses Collided at Bus Stand in Peddapalli :పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని బస్టాండ్ వద్ద రెండు ఆర్టీసీ బస్సులు(Two RTC Buses Collided) ఢీకొనడంతో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంథని నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. బస్టాండ్​లోకి వస్తున్న కరీంనగర్ నుంచి గోదావరిఖనికి వెళ్లే బస్సు ఒకదానికొకటి వేగంగా ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 

10 People Seriously Injured After Two RTC Buses Collided :బస్సులో ఉన్న వారిలో 10 మందికి తీవ్ర గాయాలు, పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బీజేపీ అభ్యర్థి దుగ్యాల ప్రదీప్ కుమార్ ప్రయాణికులను ఓదార్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మధ్యకాలంలో ఆర్టీసీ బస్సులు సైతం తరచూ ప్రమాదాలకు గురవుతుండటంతో ప్రయాణికులు బస్సు ఎక్కాలంటేనే జంకుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details