తెలంగాణ

telangana

Karimnagar district

ETV Bharat / videos

Live Video : డ్రైనేజీ పనులు చేస్తుండగా కూలిన గోడ.. ఇద్దరు మృతి - Karimnagar Smart City works latest news

By

Published : Feb 2, 2023, 1:46 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

Wall Collapse in Karimnagar   కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమలనగర్​లో డ్రైనేజీ పనులు చేస్తుండగా పక్కనున్న ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండా పనులు చేయిస్తూ.. కార్మికుల ప్రాణాలతో గుత్తేదారులు చెలగాట మాడుతున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు కావడంతో విషయము వెలుగులోకి వచ్చింది. దీనిపై అధికారులు గానీ.. ప్రజా ప్రతినిధులు గానీ స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్మార్ట్ సిటీ పనులు వేగవంతం చేయాలనే క్రమంలో రాత్రి సమయాల్లో కూడా పనులు చేపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details