తెలంగాణ

telangana

Gold Smuggling

ETV Bharat / videos

Gold Smuggling: ఇదేందయ్యా ఇది.. బూట్​లో బంగారం స్మగ్లింగ్​ - శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్

By

Published : Apr 21, 2023, 4:42 PM IST

Gold Smugglers Arrest at Shamshabad Airport: హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఆ ఇద్దరి దగ్గర నుంచి రూ.28.5 లక్షలు విలువైన దాదాపు అరకిలోకి పైగా పసిడిని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి గురువారం అర్ధరాత్రి వచ్చిన ప్రయాణికుడి దగ్గర నుంచి అక్రమంగా తెచ్చిన 230 గ్రాముల సిల్వర్ కోటెడ్ బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. రూ.13.5 లక్షలు విలువైన 230 గ్రాముల సిల్వర్ కోటెడ్ ఉంగరాలు, రిస్ట్ బాండ్స్, గజ్జెలు తదితర రూపంలో బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అలాగే ఇవాళ ఉదయం జడ్డా నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి నుంచి రూ.15 లక్షలు విలువైన 250 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ప్రయాణికుడు అరికాలికి అంటిచుకుని బంగారం కనిపించకుండా సాక్స్​లు వేసుకుని తీసుకొచ్చినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వెంటనే తనిఖీలు చేసి వారు తీసుకొచ్చిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమ రవాణా చేసిన ఇద్దరి ప్రయాణికులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details