తెలంగాణ

telangana

ETV Bharat / videos

2 మామిడిపండ్లు చోరీ.. మైనర్లను కట్టేసి చితకబాదిన యజమాని - మామిడి కాయల దొంగతనంతో

By

Published : May 20, 2022, 7:54 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

మామిడి తోటలో రెండు మామిడిపండ్లు దొంగతనం చేశారని ఇద్దరు బాలురను కట్టేసి చితకబాదాడు ఓ యజమాని. ఈ సంఘటన బిహార్​లోని మధుబనీ జిల్లాలో వెలుగుచూసింది. ఒకే తాడుతో ఇద్దరి చేతులు వెనక్కి కట్టి.. లాక్కెళుతూ మామిడి కొమ్మలతో కొడుతున్న దృశ్యాలు వైరల్​గా మారాయి. బట్టలు విప్పించి చిన్నారుల శరీరంపై తేనెతుట్టెలను వేస్తూ తేనెటీగలతో కుట్టించే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న కొందరు మహిళలు బాలురను చూసి నవ్వుతూ ఎంజాయ్​ చేశారు. జిల్లాలోని బాసుదేవపుర్​ గ్రామంలో జరిగినట్లు సమాచారం అందిందని, వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని లౌకహా స్టేషన్​ ఎస్సై సంతోశ్​ కుమార్​ మండల్​ తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details