జనంపైకి ఎడ్లు దూసుకెళ్లి ఇద్దరు మృతి - karnataka diwali celebrations
కర్ణాటకలో శివమొగ్గ ప్రాంతంలో దీపావళి సందర్భంగా నిర్వహించిన ఎడ్ల పందాలు రెండు కుటుంబాల్లో విషాదం నింపాయి. రెండు వేర్వేరు గ్రామాల్లో ఎడ్లు పొడిచి ఇద్దరు వ్యక్తులు మరణించారు. షికారిపురి గ్రామంలో జరిగిన ఎడ్ల పందెంలో యజమాని నుంచి తప్పించుకున్న ఓ ఎద్దు ప్రశాంత్(36) అనే వ్యక్తి పైకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి మృతి చెందాడు. జాడే గ్రామంలో నిర్వహించిన ఎడ్ల పందెంలో ఎద్దు పొడిచి ఆది(20) అనే యువకుడు మరణించాడు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST