Two Headed Goat Suryapet : రెండు తలలున్న మేకను చూశారా.. ఇదిగో ఈ వీడియో చూసేయండి - Two Headed Goat Suryapet
Two Headed Goat Suryapet : అప్పుడప్పుడు కొన్ని ఆసాధారణ సంఘటనలు మనల్ని అబ్బురపరుస్తుంటాయి. బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజంగానే జరగుతుందేమోనని అనిపించేలా చేస్తాయి. సాధారణంగా జంతువులకు ఒక తల, నాలుగు కాళ్లు ఉండటం చూస్తుంటాం. కానీ ఈ మేక పిల్ల మాత్రం రెండు తలలు, అయిదు కాళ్లతో జన్మించింది. ఈ వింత ఘటన సూర్యాపేట జిల్లా ఎర్రకుంట తండాలో చోటుచేసుకుంది.
Goat with Two Heads in Suryapet : చింతలపాలెం మండలం ఎర్రకుంట తండా గ్రామానికి చెందిన గుగులోత్ బుల్లి సక్రు.. మేకలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రోజు మందలోని మేకకు రెండు పిల్లలు పుట్టాయి. అందులో ఒకటి సాధారణ రూపంలో జన్మించగా.. మరొక మేకపిల్ల మాత్రం రెండు తలలు, అయిదు కాళ్లతో జన్మించింది. అరుదైన లక్షణాలతో పుట్టిన మేకపిల్లను చూడటానికి స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి మేక పిల్ల పుట్టలేదని.. ఇదే మొదటిసారని గుగులోతు సక్రు పేర్కొన్నారు. ప్రస్తుతం మేక పిల్ల ఆరోగ్యంగా ఉందని తెలిపారు.