వారిద్దరిపై డౌట్.. చెక్ చేస్తే పుస్తకాల్లో 90 వేల డాలర్లు.. 2కిలోల గోల్డ్ పేస్ట్! - ఒకటిన్నర కోట్ల విలువైన బంగారం స్వాధీనం
డాలర్లను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు విదేశీ ప్రయాణికులను ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. పుస్తకాల్లో డాలర్లను దాచి వీరు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి 90వేల అమెరికా డాలర్లను సీజ్ చేశారు. వారి వద్ద రెండున్నర కిలోల బంగారం కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పేస్ట్ రూపంలో బంగారాన్ని తరలించేందుకు యత్నించారని వివరించారు. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. అజెర్బైజాన్ నుంచి షార్జాకు వెళుతున్న ప్రయాణికుడి దగ్గర నుంచి 90వేల డాలర్ల(75 లక్షలు)ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ విదేశీయుడు డబ్బులను పుస్తకాల్లో దాచి తీసుకెళుతున్నాడని తెలిపారు. పేస్ట్ రూపంలో ఒకటిన్నర కోట్ల విలువైన బంగారాన్ని(2.5కిలోల కంటే ఎక్కువ) తీసుకెళుతున్న దుబాయ్ నుంచి వచ్చిన పాలస్తీనాకు చెందిన ప్రయాణికుడిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరిద్దరిని కస్టమ్ అధికారులు అరెస్టు చేసి కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.