తెలంగాణ

telangana

blast

ETV Bharat / videos

Cylinder blast in Nalgonda centre : పండ్లమార్కెట్​ కోల్డ్​స్టోరేజ్​లో.. గ్యాస్ సిలిండర్​ పేలి ఇద్దరు మృతి - Telangana latest news

By

Published : Jun 26, 2023, 4:12 PM IST

Cylinder blast in Nalgonda Fruit market : నల్గొండ జిల్లా కేంద్రంలోని ఫ్రూట్ మార్కెట్​లో దారుణం జరిగింది. కోల్డ్​స్టోరేజీలోని ఏసీ గ్యాస్​ సిలిండర్ పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.నల్గొండ జిల్లా కేంద్రంలోని వన్​ టౌన్ పోలీస్​ స్టేషన్​ పరిధి వెటర్నరీ ఆసుపత్రి సమీపంలోని.. బర్కత్​పురా కాలనీ ఫ్రూట్​ కోల్డ్​స్టోరేజీలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. న్యూ స్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్​స్టోరేజీలో ఏసీ గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా ఒక్కసారిగా పేలడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. షాప్ యజమాని షేక్ ఖలిమ్, అందులో పని చేసే ఆటో డ్రైవర్ సాజిద్​లు ఇద్దరు ప్రమాదస్థలిలోనే మృతి చెందగా.. మరో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి ప్రాణాలతో బయట పడినట్లు వన్ టౌన్ సీఐ రౌత్ గోపి తెలిపారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల శరీరభాగాలు ఎక్కడికక్కడే చెల్లాచెదురయ్యాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


 

ABOUT THE AUTHOR

...view details