తెలంగాణ

telangana

పువ్వాడ అజయ్ వయ్యారిభామ లాంటి వాడని అది పూజకు పనికిరాదని కేసీఆర్​కు తుమ్మల కౌంటర్

ETV Bharat / videos

ఖమ్మంలో రాజకీయ కాక - సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్ - కేసీఆర్​కు తుమ్మల కౌంటర్

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2023, 12:02 PM IST

Tummala Counter To CM KCR Comments in Khammam Meeting: ఖమ్మం జిల్లాలో జెండా కట్టే దిక్కు లేక మూడు నెలలు తనను బతిమిలాడితే బీఆర్​ఎస్​లో చేరానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం రోజున ఖమ్మంలో నిర్వహించిన బీఆర్​ఎస్​ ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి అన్న మాటలకు తుమ్మల కౌంటర్ ఇచ్చారు. ఓ మూలన కూర్చున్న.. తనను పిలిచి మంత్రి పదవి ఇచ్చానని కేసీఆర్ చెప్పటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. 

Khammam Latest Politics :తనను బతిలాడితే.. ఏమీ లేని బీఆర్​ఎస్​కు జడ్పీటీసీలను, ఎంపీటీసీలను, సర్పంచ్​ లను తీసుకొచ్చి ఆ పార్టీ నిర్మాణం చేశానని తుమ్మల తెలిపారు. పువ్వాడ అజయ్ కుమార్ వయ్యారిభామ పువ్వు లాంటి వారని, అది పూజకు పనికిరాదని తుమ్మల అన్నారు. తుమ్మ చెట్టు.. చావ నాగలితో వ్యవసాయానికి ఉపయోగపడి, అందరికీ అన్నం పెడుతుంది అన్నారు. ఖమ్మంలో అజయ్ పని అయిపోయిందని.. సభకు ఎవరు రాకపోతే ఇతర మండలాల నుంచి 300 ఇచ్చి, మనుషులను తీసుకువచ్చారని చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details