తెలంగాణ

telangana

Tula Uma Clarity on Party Joining

ETV Bharat / videos

కమలంను వీడి కారు ఎక్కనున్న తుల ఉమ - Telangana Assembly Elections 2023

By ETV Bharat Telangana Team

Published : Nov 12, 2023, 12:08 PM IST

Tula Uma Clarity on Party Joining: వేములవాడ నుంచి బీజేపీ టికెట్‌ ఆశించి భంగపడ్డ.. ఉమ్మడి కరీంనగర్‌ మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ బీఆర్ఎస్​లో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని తుల ఉమను.. ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్‌ కోరారు. కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తుల ఉమ తెలిపారు. మరోవైపు మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలో దిగటంతో సీన్ మారిపోయింది.

జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య, వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు, దరువు ఎల్లన్న తదితరులు నిన్న రాత్రి ఉమను కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఫోన్ ద్వారా తుల ఉమతో మాట్లాడి పార్టీలోకి  రావాల్సిందిగా కోరారు. దీంతో ఆదివారం తుల ఉమ బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు వివరించారు. తుల ఉమ బీఆర్ఎస్​లో చేరితే  బీజేపీకి భారీ నష్టం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details