తెలంగాణ

telangana

Ttdp Kasani On Rains Issue

ETV Bharat / videos

TTDP President Kasani on Telangana Floods : చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి: కాసాని - ttdp on telangana floods

By

Published : Jul 31, 2023, 4:57 PM IST

TTDP Reaction on Telangana Floods : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో వరదలపై మీడియాతో మాట్లాడిన కాసాని వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ తరపున నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు.

వానల కారణంగా పంట చేలల్లోకి ఇసుక చేరడం, భూమి కోతకు గురవడం, బురద పేరుకుపోవడం, వరదలో కొట్టుకొచ్చిన చెట్లు, కర్రలు చేరడంతో పొలాలు భారీగా దెబ్బతిన్నాయన్నారు. ఈ విపత్కర పరిస్థితితో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని... నష్టపోయిన వారికి ఎకరాకు 20వేలు పరిహారం చెల్లించాలన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం దీనిని విపత్తుగా పరిగణించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందాన్ని దేశం నేతలు కలవనున్నట్టు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details