TTD electric bus was stolen in Tirupati: టీటీడీ ఎలక్ట్రిక్ బస్సును చోరీ చేసిన దుండగులు.. చార్జింగ్ అయిపోవడంతో దొరికిన బస్సు - టీడీపీ బస్సు చోరిపై
Published : Sep 24, 2023, 4:27 PM IST
TTD electric bus was stolen in Tirupati ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో తెల్లవారుజామున రెండు కోట్ల విలువైన శ్రీ వారి ఉచిత ఎలక్ట్రిక్ బస్సును దొందలు అపహరించారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆ బస్సును నాయుడుపేట వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు ఉదయం జీఎన్‌సీ ప్రాంతంలో బస్సును దొంగిలించినట్లు తితిదే అధికారులు గుర్తించారు. వెంటనే అధికారులు బస్సు అపహరణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాయుడుపేట బిరదవాడ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా దుండగులు బస్సును ఆపిన దొంగలు టిడ్కో ఇళ్ల మీదుగా పారిపోయారు. ఇది గమనించిన పోలీసులు బస్సును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తితిదే అధికారులకు సమాచారం చేరవేశారు. తిరుమలలో ధర్మరథం బస్సు చోరీ ఘటనపై బీజేపీ నేతలు నేత నేత భానుప్రకాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తితిదే భద్రతా వైఫల్యం వల్లే బస్సు చోరీ జరిగిందని పేర్కొన్నారు. గతంలో సైతం తితిదే వైద్యాధికారి కారును అపహరించారని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా... తిరుమల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.