తెలంగాణ

telangana

tsrtc md sajjanar

ETV Bharat / videos

​ఆర్టీసీ డ్రైవర్లకు టాక్ట్ అనే పేరుతో.. శిక్షణకు శ్రీకారం చుట్టిన టీఎస్​ఆర్టీసీ - టీఎస్​ఆర్టీసీ సిబ్బందికి నైపుణ్య శిక్షణ

By

Published : Mar 28, 2023, 7:57 AM IST

TSRTC Drivers TACT Training: ఆర్టీసీ సిబ్బందికి టీఎస్​ఆర్టీసీ టాక్ట్​ ద్వారా నైపుణ్య శిక్షణ ఇస్తుందని టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ పేర్కొన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం, సురక్షితమైన ప్రయాణం అందించడమే లక్ష్యంగా ఈ శిక్షణ కొనసాగుతుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి టాక్ట్ అనే పేరు పెట్టామని వివరించారు. టాక్ట్ అంటే అపాయంలో ఉపాయం అని అందుకే ఈ పేరు పెట్టామన్నారు. ఇది ఆర్టీసీ సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం అనే ట్యాగ్ లైన్ తో శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. టాక్ట్​లో భాగంగా నైపుణ్యాభివృద్దితో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం, అందుకు సిబ్బంది అనుసరించాల్సిన వ్యూహాల రచనపై శిక్షణ ఇస్తున్నామని ఆర్టీసీ ఎండీ వెల్లడించారు. ఆర్టీసీ ప్రమాదాల నివారణకు ఆర్టీసీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? టాక్ట్​లో భాగంగా డ్రైవర్లకు ఎటువంటి శిక్షణ ఇస్తున్నారు..? తదితర వివరాలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖీ.

ABOUT THE AUTHOR

...view details