తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆర్టీసీపై రామ్​ మిరియాలా అద్దిరిపోయే సాంగ్ - ఆర్టీసీపై పాడిన పాటను విడుదల చేసిన సజ్జనార్

By

Published : Dec 21, 2022, 4:35 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

Bajireddy Govarthan Released The Song Sung On RTC సీఎం కేసీఆర్‌ ఈ నెల 24న 50 కొత్త బస్సులు ప్రారంభిస్తారని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. మరో 250 బస్సులు త్వరలోనే వస్తాయని వెల్లడించారు. గతంలో 97 బస్సు డిపోలు నష్టాల్లో ఉంటే ప్రస్తుతం 40 నుంచి 50 వరకు బస్సు డిపోలు లాభాల్లోకి వచ్చాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌ మహత్మగాంధీ బస్‌ స్టేషన్‌లో ఆర్టీసీపై రామ్​ మిరియలా రాసి పాడిన పాటను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ప్రైవేటు రవాణ వ్యవస్థ పెరిగినప్పటికీ ఆర్టీసీని ఎంతోమంది ఆదరిస్తున్నారని సజ్జనార్‌ అన్నారు. ఆర్టీసీ బస్సు గురించి ప్రజలకు తెలియజేయడమే ఈ పాట ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details