ఘోర ప్రమాదం.. క్షణాల్లో గాల్లో కలిసిన ప్రాణం - రోడ్డు ప్రమాదం ఈటీవీ భారత్
truck hit bike in ujjain: మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కును ఢీకొట్టిన ద్విచక్ర వాహనదారుడు.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన నాగ్దా తహసీల్‌లో చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఓ ట్రక్కు.. కారును ఓవర్‌టెక్ చేసే క్రమంలో కుడివైపునకు వెళ్లింది. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనదారులు.. అయోమయానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది. బైక్ వెనక కూర్చున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయినట్లు చెప్పారు. ట్రక్కు డ్రైవర్ అతితెలివి ప్రదర్శించాడని.. సమీపంలోని ఓ దాబా వద్ద ఆగి.. లారీకి అంటిన రక్తాన్ని కడిగేశాడని వివరించారు. ట్రక్కు వివరాలు సేకరించినట్లు తెలిపారు. త్వరలో డ్రైవర్‌ను అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST