తెలంగాణ

telangana

Truck fall into Road hole in Hyderabad

ETV Bharat / videos

Truck fall into Road hole in Hyderabad : రోడ్డుపై గుంతలో పడ్డ లారీ.. భారీగా ట్రాఫిక్ జామ్

By

Published : Aug 10, 2023, 5:45 PM IST

Updated : Aug 10, 2023, 7:25 PM IST

Truck fall into Road hole in Hyderabad : రహదారులపై నిర్వహణ లోపం వాహనదారుల పాలిట శాపంగా మారుతోంది. రోడ్డు మీద ఉన్న భయంకరమైన మూలమలుపులకు తోడు సూచికలు లేకపోవడంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో రాంగ్ రూట్లో వస్తున్న లారీ ఒక్కసారిగా నాలాల్లో కుంగిపోయింది. జ్యోతినగర్‌లోని సిమెంటు రోడ్డుపై ఉన్న స్లాబ్ విరిగిపోవడంతో అటు వైపుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా నాలాల్లో పడిపోయింది. దీంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సహాయంతో లారీని బయటకు తీశారు. గొయ్యి చుట్టూ రక్షణ కవచంలా బారికేడ్లను ఏర్పాటు చేశారు. వెంటనే జీహెచ్​ఎంసీ సిబ్బందికి సమాచారాన్ని అందించారు. రహదారుల నిర్మాణ లోపం కారణంగానే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు . అధికారులకు రహదారుల పర్యవేక్షణపై శ్రద్ధ లేదంటూ స్థానికులు, వాహనదారులు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్ల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Last Updated : Aug 10, 2023, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details