తెలంగాణ

telangana

MRO

ETV Bharat / videos

Tribals Hit MRO In Mahabubabad : తహశీల్దార్​పై గిరిజనుల దాడి.. అదే కారణమా? - మహబూబాబాద్​ ఎంఆర్వోపై దాడి

By

Published : Jun 18, 2023, 4:55 PM IST

Tribals Hit MRO In Mahabubabad : మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్​ కార్యాలయం సమీపంలో ప్రభుత్వ స్థలం సర్వే నంబర్​ 551లో కోర్టు కాంప్లెక్స్​ నిర్మాణం కోసం భూసేకరణకు సర్వే, రెవెన్యూ అధికారులు వెళ్లారు. వారి భూసేకరణను గిరిజనులు అడ్డుకున్నారు. దీనితో గిరిజనులకు, రెవెన్యూ అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వివాదం ఎక్కువగా ముదరకుండా అక్కడి నుంచి రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు. అనంతరం మండల తహశీల్దార్​ ఇమ్మాన్యుయల్​పై గిరిజనులు దాడి చేశారు. ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న వారు సెల్​ఫోన్​లలో రికార్డు చేశారు. వెంటనే ఎంఆర్వో పోలీసులకు ఫోన్​ చేయడంతో.. అప్రమత్తమైన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసుల రాకతో దాడి చేసిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. తహశీల్దార్​ను మహబూబాబాద్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం కోర్టు కాంప్లెక్స్​ నిర్మాణ స్థలాన్ని హైకోర్టు జడ్జి పరిశీలించారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని.. విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details